10 April, 2026 | 4:49 AM

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

13-05-2024 02:42 AM

౧౦ మందికి తీవ్రగాయాలు

భద్రాద్రి కొత్తగూడెం, మే 12  (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ౨౦ మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ఆదివారం భద్రాద్రి కొత్తగూడె జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక శివారు లో ప్రమాదం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్పు బూర్గంపాడు మండలం మోతె గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నా రు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, ౨౦ మంది స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకొన్న బూర్గంపాడు పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.