24-07-2025 12:00:00 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
హాలియా, జూలై 23 : హాలియాలోని అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏ టి సి) ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డిలు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే హాలియా ఏటిసిని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. ఏ టి సి లో వివిధ మెషినరీ ఏర్పాటు చేసినందున ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఏటీసీ ప్రిన్సిపల్ మల్లికార్జునను ఆదేశించారు.
సాధ్యమైనంత త్వరగా ఏటీసీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి అన్ని ఏ టి సి ల ప్రారంభం సందర్బంగా హాలియ ఏ టి సి ని ప్రారంభించేలా చూస్తానని ఎంఎల్ ఏ తెలిపారు. ఏ టి సి లో ఉన్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, బ్యాచ్ లు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ట్రాన్స్ ఫార్మర్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, రోబోటిక్ ఎక్సలెన్సీ, యంత్ర సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రస్తుత ఐటిఐ లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పై సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ లెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఇంచార్జ్ తహసీల్దార్ రఘు, ప్రిన్సిపల్ మల్లికార్జున్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్ణాటీ లింగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు