24-07-2025 12:00:00 AM
- జల దిగ్బంధంలో మణుగూరు
- సర్వం వరదార్పణం..
- వరద నీటిలో మునిగిన పేదల ఇల్లులు
- బాధితుల వేదన వర్ణనాతీతం
- ముంపు ప్రాంతాలను పరిశీలిం చిన ఆర్డీవో
- సహాయక చర్యలలో అధికార యంత్రాంగం
మణుగూరు,జులై 23( విజయ క్రాంతి ): ఒకటే వాన.. ఆకాశాని కి చిల్లు పడిందా.. వ రుణుడికే కోపం వచ్చిందా.. అనే రీతిన. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం సాయంత్రం 19 సెంటీమీటర్ల వర్షపాతంతో గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో వరద ఉధృతి పట్టణాన్ని ముంచెత్తింది.
కోడిపుంజుల వాగు, మెట్ట వాగుల ప్రవాహంకు తో డుగా సింగరేణి ఓసి నుండి వచ్చే వరద నీరు కట్టువాగు లోకి చేరడంతో ఆ వాగు ఉగ్రప్రవాహం ఫలితంగా పట్టణ ప్రధానరహదా రిపై మోకాళ్ళ లోతు నీరు చేరి సుందరయ్య నగర్, వినా యక నగర్, బాలాజీ నగర్,కుం కుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్, చేపల మార్కె ట్, బాపన కుంట, శివలింగాపురం ప్రాంతం మొత్తం నీట మునిగింది. వరద నీటితో లోత ట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పేదల ఇల్లు నీట మునిగాయి. ఇళ్లల్లోకి భా రీగా వరద నీరు చేరడం తో ముంచెత్తిన వరదలకు అనేక మంది నష్టపోయారు. కొందరి ఇండ్లు పూర్తిగా దెబ్బతిని నిలువ నీడ లేకుం డా ఉంది. మరి కొంత మంది ఇంటి సామ గ్రి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి నిరాశ్రయులుగా మిగిలారు.
జలదిగ్బంధనంలో...
ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షంతో పట్టణం జలదిగ్భందం లో ఇరుక్కుంది. ఇళ్ల మధ్యలోకి వరద నీరు చేరడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపుగా అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరి ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మణుగూరు ప్రధాన రహదారి సిపి ఐ ఆఫీస్, పాత పెట్రోల్ బంక్, ద్వారకా హో టల్, సాయిబాబా గుడి ఏరి యాలలో పై అరకిలోమీటరు మేర వరద నీరు చేరి వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. దీంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాం గం రంగంలోకి దిగడం తహసీల్దార్, సీఐ లు నడుము లోతు వరద నీటిలో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పట్టణ ప్రధాన రహదారి పై పెట్రోల్ బంక్, సాయిబాబా గుడి ఏరి యా లో చెరువులను తలపిస్తోంది. కట్టవా గు, కోడిపుంజుల వాగు ప్రమాదకర స్థితిలో ప్రవాహిస్తోంది. దీంతో మెయిన్ రోడ్ పైనే భారీ నీరు చేరింది. అధికారులు పలు ప్రాం తాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాహసిల్దార్ నరేష్, సిఐ నాగబా బు, ఎస్త్స్ర రంజిత్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తమ సిబ్బంది తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భాధితుల కు ధైర్యం చెప్పి వారిని సురక్షిత ప్రాంతానికి తర లించారు.
ప్రధాన రహదారి వేణు రెస్టారెంట్ వద్ద వరద భారీగా చెరి మోకాలు లోతు స్థాయిలో నీరు ప్రవాహం సాగింది. మరోవైపు బస్ డిపో ఏరియాలోని ఎస్సీ హాస్టల్ లోకి వరద నీరు చేరటంతో హాస్టల్ విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు.ముత్యాలమ్మ నగర్ లో అయితనకుంట చెరువు అలుగు ప్రాంతంలో కట్ట తెగిపోవడంతో వరినార్లు కొట్టుకుపోయాయి. అన్నారం, రామనుజవ రం, పగిడేరు గ్రామాలలో కూడా వరద నీరు అంతర్గత రోడ్లపై చేరింది.
ఆర్డీవో పరిశీలన..
పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం భద్రాచలం ఆర్డీవో దామో దర్రావు సందర్శించారు. సుందరయ్య నగర్, ఆదర్శనగర్, మౌనిక రెస్టా రెంట్ ఏరియాలలో పర్యటించి, కట్టవాగు, మెట్టవాగు వర ద ఉధృతిని పరిశీలించారు. స్థాని కులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర సేవలను అందించాలని, అధికా రులను ఆదేశించారు. వరదల నేపద్యంలో రెవెన్యూ, మున్సిపాలిటీ, మండల అధికారులసంయుక్తంతో డిడిఆర్‌ఎఫ్, ఎండిఆర్‌ఎఫ్, సిబ్బందిని డిఎస్పి రవీం దర్ రెడ్డి అప్రమత్తం చేశారు.సహాయక చర్యల్లో తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు.
బాధితులకు న్యాయం చేయాలి..
నీట మునిగిన కాలనీలలో మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ, సామా జిక కార్యకర్త కర్నె రవి పర్యటించి బాధితులను పరా మ ర్శించి ధైర్యం చెప్పారు. వరద బాధితులను అప్రమత్తం చేయడంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమ ర్శించారు. వరద బాధితుల పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరికీ దుఖం వస్తున్నదని, పాలకులలో మా త్రం ఏమాత్రం చలనం రావడం లేదన్నారు. వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూ పాలని, ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష సాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా భారీ వర్షం, వరద నీటి ప్రభావంతో అనేకకుటుంబాలు నిరాశ్రయులు గా మారారు. తమను ప్రభు త్వమే ఆదుకోవాలని, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వర దలతో తాము ఇబ్బందులు పడు తున్నామ ని, కట్టవాగు, మెట్టవాగు వరద నీటి నుండి కాపాడాలని, తమకు శాశ్విత పరిష్కారం చూ పాలని బాధితులు వేడుకుంటున్నారు.