calender_icon.png 29 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలే ముద్దు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

24-07-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి జూలై 23 ( విజయ క్రాంతి ): ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలంలో మాదాపురం గ్రామంలో , ఆలేరు నియోజకవర్గం లోని అన్ని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులకి  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  కూతురు సక్ఫాల్ పటేల్ జన్మదిన సందర్భంగా  విద్యార్థిని, విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తో కలసి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల మంచి భవిష్యత్తు కల్పించి  వారు ఒక మంచి స్థాయిలో ఉండాలన్నదే తమ అభిప్రాయమన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో  అందిస్తున్న సకల సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో  అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని  అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యా వ్యవస్థకి  పెద్దపీట వేసిందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఈరోజు ప్రభుత్వ ఎమ్మెల్సీ అయ్యారు ఈ వేదిక  నిదర్శనం అన్నారు.ప్రభుత్వ  నియోజకవర్గం లోని విద్యార్థులందరికీ  ఉచితంగా షూస్ పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.మన జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చదివిన ప్రభుత్వ స్కూల్ నుండి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. కొన్ని గ్రామాల్లో మూత పడిన పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక అడ్మిషన్స్ వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, మందాపురం జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు మాలతి, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.