సేవాభూషణ్ పురస్కారాల ప్రదానం
నాగోల్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): శ్రీపురం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై నిర్వహించిన సంగీతనృత్య ప్రార్థన సేవాభావం తో పురస్కారాల ప్రదానం కార్యక్రమం ఘ నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు సమాజానికి మార్గదర్శకాలని, సంగీతంనృత్యం ద్వారా ఆధ్యాత్మిక తను ప్రజలకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. సేవాభావంతో కళాకారులను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభా వంతులైన కళాకారులకు సేవాభూషణ్ పురస్కారాలను ప్రదానం చేశారు.
ప్రముఖులు, ఆహ్వానితులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశా రు. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేకంగా నిలిచింది. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




