13-12-2025 01:23:48 AM
మేడారం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పనులను చేప ట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి, జాతరలో ఎవరికి ఇ బ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ములు గు జిల్లాలోని మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలిం చారు.
సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మా ణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ ప నులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను, జంపన్న వాగు వద్ద పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, పనులల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. వారివెంట ములు గు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ఉన్నారు.