13-12-2025 01:25:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ర్టం అప్పుల్లో ఉన్నదని చెపు తూనే మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత సరదా కోసం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని, ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో సీఎం ఆడబోయే ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఏకం గా రూ.100 కోట్లకు పైగా ప్రజాధనం దుబారా చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ ఆర్థిక నేరమే అని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గురువారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. ‘గంటన్నర మ్యా కోసం సీఎం ప్రాక్టీస్ చేయడానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రూ.5 కోట్లతో ప్రత్యేక గ్రౌండ్ వేశారు. మెస్సీకి అప్పియరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు ఇస్తున్నారని సమాచారం. ఆయన భద్రతా సిబ్బంది, విమాన ఖర్చు లు, వసతి.. అన్నీ కలిపితే ఖర్చు రూ.100 కోట్లు దాటుతోంది. ఈ డబ్బును ఏ శాఖ నుంచి తీస్తున్నారు క్యాబినెట్ అనుమతి ఉందా’ అని నిలదీశారు.
సీఎం రేవంత్ టీమ్‌ను సింగరేణి సంస్థ స్పాన్సర్ చేస్తోందన్న వార్తలపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన శాఖ పరిధిలోని సింగరేణి నిధులను సీఎం ఫుట్ బాల్ ఆటకు దారపోస్తున్నారని మండి పడ్డారు. డిసెంబర్ 8, 9 తేదీల్లోనే గ్లోబల్ సమ్మిట్ ముగిసిపోయిందని, కానీ మంత్రులు మాత్రం ఈ మ్యాచ్ సమ్మిట్‌లో భాగమని చెప్పడం సిగ్గుచేటని విమర్శించా రు.
దేశంలోనే అత్యుత్తమ క్రికెట్ పిచ్‌లలో ఒకటైన ఉప్పల్ స్టేడియాన్ని ఈ మ్యాచ్ కోసం ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ యథావిధిగా చేయడా నికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ-రేస్ పేరు తో నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించిన కాం గ్రెస్.. ఇప్పుడు చేస్తున్నది అదే కదా అని నిలదీశారు.