calender_icon.png 16 December, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డితో అఖిలేష్ భేటీ

13-12-2025 01:12:02 AM

తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీ హిల్స్‌లోని నివాసంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

రాష్ట్రంలో యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను రాష్ట్ర ప్రభు త్వ పండుగా గుర్తిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. దేశంలోని యాదవ సమా జం రేవంత్‌రెడ్డిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. యాదవుల హృద యంలో రేవంత్‌రెడ్డి ఉండిపోతారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని యాదవవర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.