1 August, 2026 | 1:07 AM

ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్‌లో ట్రాఫిక్‌పై అవగాహన

01-08-2026 12:00 AM

‘అరైవ్ అలైవ్’లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

శంషాబాద్, జూలై 31 (విజయక్రాంతి): శంషాబాద్లోని ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్లో ’అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు దాటే విధానం, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, జీబ్రా క్రాసింగ్ వినియోగం, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం, మైనర్లు వాహనాలు నడపకూడదనే అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.

అలాగే రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న ట్రాఫిక్ నియమాలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి సమాజంలో రహదారి భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.