calender_icon.png 29 September, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్

29-09-2025 05:24:27 PM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నిధులను సోమవారం విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే విడుతలో బిల్లులు విడుదల చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. దసరా పండుగ ముందు తమ కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనందం నింపిందని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతోనే నిధులు విడుదలయ్యాయని విలేజ్ సెక్రటరీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి సీతక్కకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా గ్రామల్లోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో మాట్లాడడంతో వారు వెంటనే స్పందించి ఒకే విడతలో రూ.104 కోట్ల నిధులు విడుదల చేశారని చెప్పారు. ఈ సందర్భం సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలపారు. ఈ నిధులను స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందే విడుదల చేయడం హర్షించదగిన విషయమన్నారు.