calender_icon.png 17 September, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

17-09-2025 07:37:49 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 18, 19వ డివిజన్లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా శివాలయంలో మోడీగా పేరు మీద అర్చన, పాలాభిషేకం చేయించి నరేంద్ర మోడీ వంద సంవత్సరాల పైబడి జీవించాలని అలాగే ఆయురారోగ్యాలతో జీవించాలని మరెన్నో విజయాలకు బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి తగ్గకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ నాయకులను తన వైపు తిప్పుకునే సమర్ధుడు అంటూ కొనియాడుతూ నరేంద్ర మోడీకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అప్పుడు నైజం ప్రభువులు మన ప్రజలను చిత్రహింసలు పెట్టారు మన ఆడిబిడ్డలను బతుకమ్మ ఆడించేవారు నానా రకాలుగా చిత్రహింసలు చేసినారు అది గమనించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు 1948 సెప్టెంబర్ లో సైనిక చర్య చేపట్టి నైజం రాజ్యాన్ని సెప్టెంబర్ 17 రోజున భారతదేశంలో విలీనం చేసి నైజం రాజ్యం నుంచి ప్రజలను విముక్తిని చేశారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించాలని బిజెపి పార్టీ పక్షాన  డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గంట నరసింహారెడ్డి భూపతిరెడ్డి, ఎం లక్ష్మీరాజం, ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోదారి నరేష్, బూత్ అధ్యక్షులు నాంపల్లి శంకర్ అన్నాజీ వినీత్ మైపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి, ప్రకాష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.