calender_icon.png 17 September, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షెడ్యూల్ తెగల సమస్యలపై భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు వినతి

17-09-2025 07:39:41 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): షెడ్యూల్ తెగల సమస్యలపై పోచారం మున్సిపల్ అన్నోజిగూడకు చెందిన జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు, బిజెపి తమిళనాడు రాష్ట్రం ఇంచార్జి ననావత్ బిక్కునాథ్ నాయక్ బుధవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి దేశంలో నివసిస్తున్న షెడ్యూల్ తెగల సమస్యలు, గిరిజనుల హక్కుల గురించి వినతిపత్రం అందజేశారు.

మన సమాజం అవకాశాలు అభివృద్ధి పొందేందుకు వీలు కల్పించడంలో  గిరిజనులు కీలకపాత్ర పోషించారు. రాజ్యాంగ అధికారం మరియు సామాజిక న్యాయం గిరిజన వర్గాల సాధికారిక పట్ల మీ నిబద్ధతపై మా పూర్తి విశ్వాసం ఉన్నదన్నారు. మాతో సహా అన్ని అనగారిన వర్గాల హక్కులను కాపాడటం నిలబెట్టడం కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. మీ మార్గదర్శకత్వంలో భారత రాజ్యాంగ విలువలు న్యాయం, అందరికీ సమానత్వం మరియు గౌరవం సంరక్షింపబడి బలోపేతం అవుతాయని విశ్వసిస్తున్నామన్నారు.