17-09-2025 07:36:30 PM
స్థాయిని మించి విమర్శలు వద్దు
రేగొండ మండల బిఆర్ఎస్ నాయకుల ఫైర్
రేగొండ,(విజయక్రాంతి): మండల కాంగ్రెస్ నాయకుల రాజకీయ చరిత్రను తీస్తే వారికి రాజకీయ పుట్టగతులు ఉండవని రేగొండ మండల బిఆర్ఎస్ నాయకులు అన్నారు.బుధవారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు హింగే మహేందర్ మాట్లాడుతూ రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి స్థాయిని మించి రెండు సార్లు ప్రజల చేత శాసనసభకు ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురించి ఏక వచనంతో సంబోధిస్తూ అహంకార పూరిత మాటలు మాట్లాడడం సరి కాదన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని విమర్శించే ముందు వారి స్థానం ఏంటో గుర్తు చేసుకోవాలన్నారు.
ఒకప్పుడు ఇదే మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి మోచేతి నీళ్లు తాగి పదవుల కోసం వెంపర్లాడి ఇప్పుడు అదే పదవుల కోసం అమ్ముడుపోయిన నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.వీళ్ళు రాజకీయం చేస్తున్న ఇదే చెంచుపల్లె గ్రామానికి గతంలోనే అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రూ.1.66 కోట్ల తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.మీకు దమ్ముంటే మేము అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకొని ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలో ఎలా రాజకీయం చేయాలో మా బిఆర్ఎస్ నాయకులను చూసి నేర్చుకోవాలన్నారు.