04-08-2025 06:26:37 PM
సిడిపిఓ రేష్మ..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): తల్లి పాలకు ప్రాధాన్యత ఇవ్వండని సిడిపిఓ రేష్మ(CDPO Reshma) అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ రేష్మ మాట్లాడుతూ... నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని, తల్లి బిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంతో అవసరమని వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలన్నారు. మొదటి ఆరు నెలలో తల్లిపాలు శ్రేష్టమని, డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శైలజ, జండర్ స్పెషలిస్ట్ విజయ, ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, ఆర్థిక అక్షరాస్యత నిపుణులు లిపికా, అంగన్వాడి టీచర్స్ జ్యోతి, శంకరమ్మ, ఆయాలు తల్లులు లబ్ధిదారులు పాల్గొన్నారు.