calender_icon.png 4 August, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలి

04-08-2025 08:23:17 PM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఈ నెల 11న 15వ రౌండ్ జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా నులిపురుగుల నివారణకోసం పిల్లలందరికి ఆల్చెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 11  జాతీయ నూచిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించి 1 నుండి 19 సంవత్సరాలు వయస్సు గల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని అన్నారు. ఈ నెల 18వ తేదీన మాఫ్ అప్ రౌండ్ నిర్వహిచాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో, బడి బయట పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ వేయాలని ఆదేశించారు.

మాత్రల పంపిణీ సర్వం సిద్ధం చేశాం : డాక్టర్ కృష్ణ, జిల్లా వైద్య అధికారి

జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు 2,54,000 మంది ఉన్నారని, వారికి మాత్రలు పంపిణీ చేసేందుకు సర్యం సిద్దం చేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ వివరించారు. ఈ మాత్రను ఆహారం తీసుకున్న తర్వాతనే నమిలి మ్రింగించాలని, 1-2 సం. లలోపు పిల్లలకు 1/2 మాత్ర  పొడి చేసి ఇవ్వాలని, 2 సం.లు పైబడిన వారికి ఒక మాత్ర నమిలి మ్రింగేటట్లు చూడాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక నోడల్ టీచర్ ను  నియమించాలని, మదరసాలు, అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో అందరికి మాత్రలు పంపిణీ చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి,జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారిణిని కోరారు.

అన్ని అంగన్ వాడి కేంద్రాలలో ఒడి బయిట పిల్లలందరికి  ఆల్బెండజోల్ మాత్ర ఇచ్చే విధంగా చూడాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ని కోరారుఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డా పద్మజ, వైద్యాధికారులు డా.విద్య, డా. ప్రవీణ్ కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి జరీనా బేగం, హెల్త్ ఎడ్యూకేటర్ రాజ గోపాల చారి, అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, సుభాష్ చంద్ర, చక్రపాణి, రమేష్, సీతారాం గౌడ్, అవినాష్, రాధ తదితరులు పొల్గొన్నారు.