04-08-2025 08:20:53 PM
కోదాడ: ఖమ్మంలో జరిగిన సౌత్ ఇంటియా కరాటే చాంపియన్ షిప్(South India Karate Championship) పోటీల్లో కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీ కోపోకాన్ కరాటే క్లబ్ కు చెందిన 18 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీపడి పలు పతకాలు గెల్చుకున్నట్లు చీఫ్ ఇన్ స్ట్రక్టర్ ఆరె మాధవీలత తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ, తమ కరాటే క్లబ్ కు చెందిన విద్యార్థులు శ్రేయాన్, ఆరాధ్య, అర్జున్, తీర్ధ, శ్రీజ, సంకీర్తన, బ్లెస్సీ, మణికంఠ, జాన్వితలు ముఖ్య అతిథి షిహాన్ సందేష్ కుమార్ చేతుల మీదుగా మెడల్స్, ట్రోఫీ స్వీకరించారని తెలిపారు. విజేతలను పలువురు అభినందించారు.