04-08-2025 06:29:14 PM
సీపీఐ కలెక్టరేట్ ముట్టడి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓసి క్లబ్ ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేటు వ్యక్తుల చెర నుండి ఓసి క్లబ్ కు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ముందుగా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 నుండి ఓసి క్లబ్ అన్యాక్రాంతంపై తమ పార్టీ ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెరుగు కుమార్, నవీన్, వెంకన్న, సాంబలక్ష్మి, సందీప్, శ్రావణ్, వీరన్న, అశోక్, చిరంజీవి, యాకమ్మ, నరసయ్య, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.