calender_icon.png 18 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ విధానాన్ని తిప్పికొడతాం

18-09-2025 01:51:15 AM

  1. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శం 

సీపీఎం అఖిలభారత నాయకురాలు బృందా కారత్  

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, ప్రజల మధ్య చీలికలు తెస్తున్న బీజేపీ విధానాలను తిప్పికొడతామని  సీపీఎం అఖిలభారత నాయకురాలు బృందా కారత్ తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

తెలుగు భాషా సంస్కృతులను రక్షించేందుకు ఏర్పాటైన ఆంధ్ర మహాసభ నిజాం నవాబ్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిందన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి ప్రజలకు పంచినట్టు తెలిపారు. రైతాంగ సాయుధ పోరాటంలో ఏనాడు పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు.