16 April, 2026 | 8:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గ్రామాద్ధికే ప్రాధాన్యమిస్తా

23-12-2025 12:23 AM

-ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బాషబోయిన పోశాలు

వెంకటాపూర్, డిసెంబర్22, (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల పూర్తి మద్దతుతో విజయం సాధించిన బాషబోయిన పోశాలు సోమవారం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్గా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలస్థాయి అధికారులు, ప్రజాప్ర తినిధులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రమాణ స్వీకార అనంతరం సర్పంచ్ బాషబోయిన పోశాల మాట్లాడుతూ.. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని, గ్రామ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డులో సమాన అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం, పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచడం, అంతర్గత సీసీ రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పాఠశాలలు, అంగన్వాడీల అ భివృద్ధి, పేదల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడతామని ఆయన వివరించారు.

అలాగే ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో సమన్వయంతో గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో ఐక్యత, పరస్పర సహకారం ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామానికి శుభం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్థులు సర్పంచ్ బా షబోయిన పోశాలను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి ప్రయాణంలో ప్రజలందరి సహకారం అత్యవసరమని, సమస్యల పరిష్కారానికి ప్రజలే తన బలమని సర్పంచ్ అన్నారు.