calender_icon.png 23 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో కొలువుదీరిన నూతన సర్పంచులు

23-12-2025 12:24:26 AM

* రెండు సంవత్సరాల నిరీక్షణకు తెర

* ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల పాలన

* ప్రమాణ స్వీకారం అనంతరం మొక్కని నాటుతున్న సర్పంచ్ బొల్లెపల్లి రామనాథన్ గౌడ్

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉత్సాహభరితంగా, పండగ వాతావరణంగా సాగాయి. ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

పారదర్శక పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీరు,పారిశుధ్యం, రహదారులు, విద్యుత్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచులను పూల మాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాలు శాంతియుతంగా, సజావుగా నిర్వహించడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచుల్లో మేకపోతుల వెంకటమ్మ,బొల్లెపల్లి రామనాథం, మాశెట్టి నాగలక్ష్మి, కీత వెంకటేశ్వర్లు, కడియాల పద్మ అప్పయ్య, గుండు రామాంజిగౌడ్,చింతకాయల వినోద నాగేశ్వరరావు, కీసరి వెంకటరమణ బుచ్చిబాబు, చెనగాని సాంబయ్య, కటకం వేణు, బచ్చలకూరి శీను, ఎడవల్లి కమలమ్మ, నందిపాటి కవిత,మాలోతు సుధాకర్, బానోతు అరుణ, కాచవరపు నరసింహారావు, సండ్రపంగు బజారమ్మ, మచ్చ ముత్తమ్మ, సకినాల సైదమ్మ, కందుల మంగమ్మ, నకిరేకంటి సుధ, ఆకుల కృష్ణ,బోడ సైదిరెడ్డి, వంకుడోతు శారద,కుసుమ నర్సిరెడ్డి, బత్తిని అంజయ్య, కరణం భద్రయ్య, కేతేపల్లి నర్సయ్య, బొలిశెట్టి లక్ష్మమ్మ, కట్టా కల్యాణి, బానోతు సరోజ, గుగులోతు లకుపతి, కుర్రి మహేష్, ఉన్నారు.