2 September, 2026 | 10:47 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఠాగూర్ సినిమా చూపిన ప్రైవేట్ వైద్యులు!

09-06-2025 | 02:12am
  1. సర్జరీ చేసిన వైద్యుల తీరుపై అనుమానాలు
  2. చనిపోయిన వ్యక్తికి సీరియస్ అంటూ సీన్ క్రియేషన్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8 (విజయక్రాంతి): చనిపోయిన వ్యక్తికి ఆపరేషన్ అంటూ సీన్ క్రియేట్ చేసి, డబ్బులు దండుకున్న వైద్యుల తీరుతో ఠాగూర్ సినిమాను కండ్లకు కట్టినట్టు చూపిన వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో జరిగిం ది.

బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన ప్రకారం ఏపీ లోని ఎన్‌టీఆర్ జిల్లా ఖమ్మంపాడుకు చెందిన పత్తి పాటి కోటేశ్వరరావు (54) అనే రైతు వెన్నెముక నొప్పితో ఈనెల 2న భద్రాద్రి జిల్లా చెంచుపల్లె మం డలం, విద్యానగర్ కాలనీలో ఉన్న పీఎం బ్రదర్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం సర్జరీ చేయడానికి కొంత సమయం పడుతుందని ఇన్ పేషెంట్‌గా చేర్చుకున్నారు.

ఉన్నట్లుండి శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు పేషెంట్ కండిషన్ సీరియస్‌గా ఉందం టూ సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఖమ్మంలోని శ్రీరక్ష ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఖమ్మం ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు, సదరు పేషెంట్ చనిపోయి మూడు గంటలైందని చెప్పటంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.

ఈ తంతు జరుగుతుండగానే పేషెంట్‌ను తీసుకొచ్చిన అంబులెన్స్, రోగితో పాటు వచ్చిన కాంపౌండర్ పరారయ్యారు. బంధువులు మరో అంబులెన్స్‌లో డెడ్‌బాడీని చుంచుపల్లిలోని పీఎం బ్రదర్స్ ఆసుప త్రికి తరలిస్తున్న క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం ముందుగానే పసిగట్టి హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసింది.

శవాన్ని తీసుకొస్తున్న అంబులె న్స్‌ను లక్ష్మీదేవిపల్లి, చెంచుపల్లి వద్ద ఇద్దరు ఎస్‌ఐలు తమ బృందంలో అడ్డుకొని, ఆసుపత్రి ఎదుట ఆం దోళన చేయవద్దంటూ ఆదేశించారు. అంతేకాకుండా శవాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా లంటూ ఒత్తిడి చేశారని కుటుంబసభ్యులు ఆరోపిం చారు.

అర్ధరాత్రి ఆపరేషన్, అంతలోనే సీరియస్ అంటూ మరో ఆసుపత్రికి తరలింపు, మార్గం మధ్య లోనే ఎస్‌ఐలు అంబులెన్స్‌ను ఆపడం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం ఇలా జరిగిన ఘటనలు ఠాగూర్ సినిమాను తలపించాయి. దీంతో ఆసుపత్రి వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కొడు కు ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి.