12-07-2024 02:53:52 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట
ముషీరాబాద్, జూలై 11: బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. గురువారం జోనల్ కమిషనర్ కవి కిరణ్‌తో కలిసి సుందరయ్య పార్కు, మదర్ డైరీ పార్కు, వీఎస్‌టీ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు ఫేజ్ ఫ్లు ఓవర్ ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని కమిషనర్ పరిశీలిం చారు. సుందరయ్య పార్కులో వర్షపు నీరు నిలవడం మూలంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దాంతో పాటు టాయిలెట్ మరమ్మతులు చేపట్టాలని వాకర్స్ కమిషనర్‌ను కోరగా, సమస్యలు వెంటనే పరిష్కరిం చాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా వర్షాకాలం దృష్ట్యా ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మదర్ డైరీ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొద టి దశలో ఇందిరాపార్కు, వీఎస్‌టీ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రెండు దశల్లో ప్లు ఓవర్ నిర్మాణాలు చేపట్టాలని గతంలో నిర్ణయించారని, అయితే మొదటి దశలో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.