15 April, 2026 | 2:13 AM

మార్కెట్ యార్డ్ కోసం స్థలం కేటాయింపు ఎప్పుడు?

28-12-2025 01:06 AM

మార్కెట్‌లో జరిగే ప్రమాదాలతో ఇబ్బందులు

కుషాయిగూడ, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : కుషాయిగూడ మార్కెట్ నిత్యం ట్రాఫిక్ మధ్యల చిక్కుకుంది చిన్నగా స్థలం ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం ట్రాఫిక్‌తో ప్రమాదాలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కుషాయిగూడ మార్కెట్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో ఇటు అటు పోయేవారికి ప్రాణ సంకటంగా మారింది నిత్యం కుషాయిగూడ మార్కెట్ నుంచి వెళ్లాలన్న నరకయాతనే కుషాయిగూడ కూరగాయల మార్కెట్ కోసం కాంటాదారుల కోసం నాలుగు ఎకరాల స్థలం కేటాయిస్తానని ఎం పీగా పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంపీ హోదాలో కూర గాయల మార్కెట్ వర్తక వ్యాపారులకు హామీ ఇచ్చాడు కుషాయిగూడ లోని నాలు గు ఎకరాల స్థలం ఉన్నప్పటికీ అది ఆ ల్యాం డ్ ను మార్కెట్ కోసమని కేటాయించారు.

అది ఆ ఫైల్లు ముందుకు కదలడం లేదు దీనితో కుషాయిగూడ కూరగాయల వర్తక వ్యాపారులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని హామీని నెరవేర్చుకోవాలని ఎంపీ రేవం త్ రెడ్డికి కుషాయిగూడ కూరగాయల మార్కెట్ వర్తక వ్యాపారులు రాఘవేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కుషాయిగూడ లో కూరగాయల మార్కెట్ వర్తక వ్యాపారులకు లేకపోవడం నిత్యం నరకం అనుభవిస్తున్నారని కుషాయిగూడ కూరగాయల మార్కెట్ వర్తక వ్యాపా రులు తమ గోడును మీడియాకు వెల్లడించారు కుషాయిగూడ లో మార్కెట్ యార్డ్ లేకపోవడం విచారకరమని ప్రతి ఎన్నికల్లో రాజకీయ నాయకులు మార్కెట్ వర్తక వ్యా పారులకు ల్యాండ్ కేటాయిస్తామని చెప్పినప్పటికీ హామీ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలవ గానే ఆ హామీలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్ను స్థలం కేటా యించి ఏర్పాటు చేయాలని కుషాయిగూడ 300 మంది వర్తక వ్యాపారులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు ఒకవేళ మార్కెట్ యార్డ్ కోసం స్థలం కేటాయించక పోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని కుషాయిగూడ మార్కెట్ వర్తక వ్యాపారులు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు కుషాయిగూడ కూరగాయల మార్కె ట్ యార్డ్ విషయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండా రు లక్ష్మారెడ్డి. ఎంపీ ఈటెల రాజేందర్.చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్.లు ప్రత్యేక చొరవ తీసుకొని. మార్కెట్ యార్డ్‌ను ఏర్పా టు చేసేందు కు ముందుకు కదలాలని కుషాయిగూడ కూరగాయల మార్కెట్ వర్తక వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎన్నో ఏండ్లుగా వర్తక వ్యాపారులు కుషాయిగూడ మార్కెట్ యార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారి ఆశల మీద నీరు చల్లినట్టే ప్రతి రాజకీయ నాయకుడు మార్కెట్ యార్డు ను కేటాయిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ హామీలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు మెమొరండాలు సమర్పిం చిన ఎలాంటి ప్రయోజనాలు లేవని వర్తక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కుషాయిగూడ మార్కెట్ యార్డ్ కోసం స్థలాన్ని కేటాయించి న్యాయం చేయాలని కుషాయిగూడ మార్కెట్ వర్తక వ్యాపారులు రాఘవేం దర్ గౌడ్ అశోక్ చారి. దేవేందర్ గౌడ్ లు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.