28-12-2025 12:51:54 AM
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలపై శాంతి యు తంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే నేతలను ప్రభు త్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం నేతల అరెస్టు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిం చే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని ఆయన విమర్శిం చారు.
కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ద్వారా ప్రభు త్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయ డం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టేందుకు వచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ పేరుతో ఇచ్చిన ఏడో గ్యారెంటీ అంటే జర్నలిస్టులను అరెస్టు చేయడమేనా అని అన్నారు.
క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సింది పోయి, ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు. జర్నలిస్ట్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మారుతి సాగర్, రమేశ్ హజారి, యోగానంద్, విష్ణువర్ధన్‌రెడ్డి, రమణ కుమార్, కడకంచి వెంకట్ వంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అక్రిడిటేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రశ్నిస్తే అరెస్టులా : హరీశ్ రావు
ఇవాళ రాష్ర్ట వ్యాప్తంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చెయ్యాలని బీఆర్‌ఎస్ పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాబో యే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొ న్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని, ఉక్కు పాదంతో అణచేస్తున్నారని, వారికి ధర్నా చేసే హక్కు లేదా, దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా..?
ఇదేనా మీరు ఇస్తానన్న ఏడోగ్యారంటీ అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు లకు కేసీఆర్ 26,000 అక్రిడిటేషన్ కార్డులను రిపోర్టింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలి స్టులకు అనే తేడా లేకుండా ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి అక్రిడిటేషన్ కార్డులను 10 వేలకు తగ్గిం చడం దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోషల్ మీడియా, యూట్యూ బ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణమని, జర్నలిస్టుల పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతుగా ఉంటుందన్నారు.