ప్రొక్లెయినర్ పల్టీ కొట్టి ఆపరేటర్ దుర్మరణం
03-07-2026 12:13 AM
మహబూబాబాద్, జూలై 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారు లో లారీలోకి ప్రోక్లైనర్ ఎక్కిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఫల్టీ కొట్టి జార్ఖండ్ కు చెందిన ఆపరేటర్ అబ్బాస్ దుర్మరణం పాలయ్యాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు జేసిబి తో ఫల్టీ కొట్టిన ప్రోక్లైనర్ తొలగించి అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






