3 July, 2026 | 1:07 AM

పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలి

03-07-2026 12:13 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం

ఘట్ కేసర్, జూలై 2 (విజయక్రాంతి) : పేదలకు సంబంధించి విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం పేర్కొన్నారు. ఘట్కేసర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమైన కిడ్నీ, గుండె జబ్బులకు డాక్టర్లు లేరని పేద ప్రజలకు రోజువారీగా వస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల కోసం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగుపరచడం తోపాటు ప్రధాన జబ్బులకు డాక్టర్లను నియమించాలని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురువారం సిపిఎం ఘట్కేసర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్,  ప్రభుత్వ హైస్కూల్ సమస్యలపై సిపిఎం ప్రతినిధి బృందం సర్వే నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి మండల పార్టీ కార్యదర్శి ఎన్. సబిత మరికొందరు బృందంతో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడంతోపాటు సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విద్య, వైద్యాన్ని మెరుగుపరచడం కోసం సిపిఎం దశల వారి ఆందోళన పోరాటాలు నిర్మిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యలు ఎర్ర అశోక్,  మండల కమిటీ సభ్యులు చంద్రమోహన్,  అలివేలు, సిపిఎం నాయకులు కిరణ్, అరుణ, పద్మ, జయ, భూమయ్య, వై. రాజేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.