3 July, 2026 | 1:05 AM

మాన్సూన్‌పై పటిష్ట కార్యచరణ

03-07-2026 12:13 AM

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం

కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, జులై 2 (విజయక్రాంతి): మాన్సూన్ ముందస్తు  పటిష్ట కార్యచరణ రూపొందించాలని, అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు  సంసిద్ధంగా ఉండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజారోగ్య పరిరక్షణ మనందరి కర్తవ్యం. వైద్య ఆరోగ్య, పంచాయతీ శాఖ అధికారుల సమన్వయంతోనే సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ ప్రజావాణి హాలు నందు వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా పంచాయతీ , అధికారులతో పరిసరాల పరిశుభ్రత వ్యాధుల నిర్మూలనే ధ్యేయంగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని  వాతావరణం మారినప్పుడల్లా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వైద్య ఆరోగ్యశాఖ తో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ అలెర్ట్ గా వుండాలని అన్నారు.

ఈ నాలుగు నెలలు మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని, ఫీవర్ సర్వే చేపట్టాలని , సూచించారు. డెంగ్యూ పట్ల ప్రజల్లో ఉన్న భయాలను దూరం చేయాలని , నిరంతరం ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని, తెలిపారు. మురికి కాల్వలు లేకుండా చూడాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూడాలని, డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు ముఖ్యంగా శానిటేషన్ డ్రైవ్ పర్ఫెక్ట్ గా చేయాలని, ప్రజలకు వ్యాధులు రాకుండా కాపాడాలని, వ్యాధులు వస్తే నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తక్షణమే చికిత్స అందించాలని తెలిపారు. జూలై 13 నాడు నేషనల్ డీ వార్మింగ్ ప్రోగ్రాం ( జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం ) సంధర్భంగా ఆక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ , డి.సి.హెచ్.ఎస్. డా. శివ దయాళ్, జిల్లా విద్యా శాఖాధికారి, రాజు, డి.డబ్లు.ఓ, హేమ భార్గవి ,డి.పి.ఓ, యాదయ్య, డి.పి.అర్.ఓ, రామచంద్ర రాజు, డిప్యుటి డి.ఎం.హెచ్.ఓ డా,సృజన, డా.జయమాలిని,ప్రోగ్రాం అధికారులు డా.నవ్య, డా.హరి ప్రసాద్, డా.జయశ్రీ, నర్సాపుర్, తూప్రాన్, రామాయణం పేట్, మెదక్ మునిసిపల్ కమిషనర్లు, పి.హెచ్.సి.మెడికల్ ఆదిసర్లు, ఎం.ఎల్.హెచ్.పి.లు, సూపర్వైజర్లు ఎంపీలు  తదితరులు పాల్గొన్నారు .