ప్రొ.జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్...
బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ హాజరై జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు, మార్గదర్శకత్వం పునాదిగా నిలిచాయని అన్నారు. ఆ మహనీయుడు చూపిన దారిలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను ఏకం చేసి సుదీర్ఘ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.






