24 August, 2026 | 10:24 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

25-06-2025 07:51 PM

ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సామా అంజిరెడ్డి..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం(Malidasa Telangana Activists Welfare Association) వ్యవస్థాపక అధ్యక్షుడు సామా అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సకలజనులు నిస్వార్ధంగా, త్యాగనిరతితో దశాబ్దాల పాటు చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇంత ఘనచరిత్ర ఉన్న ఉద్యమకారులు ఆర్థికంగా గుర్తింపు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని, నెలకు రూ.25 వేల పెన్షన్ అందించి గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రభుత్వ భూముల్లో ఉద్యమకారులు జెండాలు ఎగరవేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొనతం కర్ణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా దడిపెల్లి వెంకట్, ప్రధాన కార్యదర్శిగా కుంభం మధు, సహాయ కార్యదర్శిగా ఆడెపు సోమయ్య, కోశాధికారిగా చెన్నబోయిన శివతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కుదురుపాక ఉదయ్, నియోజకవర్గ అధ్యక్షుడు దిర్షినపు కృష్ణమూర్తి, ఉద్యమకారులు లింగంపల్లి రమణ, వెంకన్న, యాదగిరి, వేణు తదితరులు ఉన్నారు.