30-07-2025 12:00:00 AM
ఖరీఫ్ సీజన్‌లో అనుకూల పరిస్థితులు నెలకొనటంతో అన్నదాత లు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులకు పెట్టుబడి సాయంఅందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ‘రైతు భరోసా’ పథకం పేరిట 62 లక్ష ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు 9వేల కోట్లు జమ చేసింది. ఈసారి నైరుతి రుతుపవనాలు దక్షణాది రాష్ట్రాలను తాకడం, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావాలతో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా యి.
దీంతో సాగు ఆశాజనకంగా ఉంది. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొ ర్లుతున్నాయి. రైతులు ముందుగానే నారుమడులు పోయడంతో మెజార్టీ మాగాణి లో వరి నాట్లు పడనున్నాయి. కొందరు రైతులు ప్రస్తుతం దమ్ము పనులు చేస్తున్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలో వర్షాభావ ఛాయలు కనిపించడంతో బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు రాష్ట్రం లో వర్షాలు పడొద్దని దేవుడిని వేడుకుంటున్నారు.
ఆ పార్టీ నేత వీ ప్రకాశ్ వర్షా భావ పరిస్థితులపై ‘ఏం పోయే కాలం వచ్చిందో?’ అంటూ మీడియా వేదికగా అవాకులు చెవాకులు పేలి రైతాంగం దృష్టిలో పలుచనయ్యారు. వానలు ఊపందుకోగానే రాష్ట్రంలో సాగు విస్తీరణం పె రిగింది. గతేడాది కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. అలాగే రైతులు మొక్కజొన్న, రాగి, సజ్జ, వేరుశనగ, నువ్వుల సాగు కూడా చేస్తున్నారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై పోలీసులు అవసరమైతే పీడీ చట్టం కింద కేసు లు నమోదు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇ ప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఈ మేర కు వ్యవసాయశాఖ అధికారులు, పోలీసు లు రాష్ట్రంలో దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది.
నకిలీ విత్తనాలపై నిఘా..
అన్నదాతలు నకిలీ విత్తనాలు కొని మో సపోవద్దని, ప్యాకెట్లు తప్ప విడిగా విత్తనాలు కొనవద్దని సూచిస్తున్నది. రైతులు అక్రమార్కుల బారినపడి మోసపోకుండా ఉండేందుకు రాష్ట్రప్రభుత్వం సమగ్ర చర్య లు తీసుకుంటున్నది. నకిలీ విత్తనాల అ మ్మకం, సరఫరాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసింది. ఆ యా బృందాలతో విస్తృతంగా దాడులు చేయిస్తున్నది.
దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు వేలాది ప్యా కెట్ల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే అక్రమార్కుల ఆట కట్టించారు. రైతు పక్షపాతిగా రైతు రుణమాఫీ చేసి, మద్దతు ధరతో పాటు వరి స న్న రకాలకు బోనస్ కల్పిస్తున్నది. అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్య వసాయ రంగ అభివృద్ధి కోసం రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
రాష్ట్రానికి చెందిన రైతులు ఇప్పుడు యూరియా సమకూర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన యూరి యా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రానికి రా వాల్సిన యూరియాను తగ్గించి, రైతులను ఇబ్బంది పెడుతున్నది. ఇదే విషయాన్ని గతంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ సైతం రాశారు.
సకాలంలో ఎరువులు సమకూరిస్తే రైతులకు మేలు జరుగుతుందని, లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రైతులు ఎరువుల కోసం క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రకటించి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాను కలిసి, తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
స కాలంలో ఎరువులు సమకూర్చాలని కోరా రు. అయినప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల రావడం లేదు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎరువులు అందకపోవడం వల్ల తాము సాగుపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపుతున్నారు.
మద్దత ధర ప్రకటించాలి..
ప్రభుత్వం రైతులకు సరిపడిన విత్తనా లు ఇస్తే సరిపోదు.. పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇస్తామనే భరోసా కూడా కల్పించాలి. సాధారణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ‘మార్కెట్ ఇంటెలిజెన్స్’ విభాగం ఉంటుంది. ఈ విభాగం సీజన్ ఆరంభంలోనే రైతులు ఏయే పంట లు సాగు చేస్తే, మంచి లాభాలు ఆర్జించవచ్చనే విషయాన్ని రైతులకు చెప్పాలి.
అలా చేస్తే మున్ముందు వాటిల్లే నష్టాల నుంచి రైతులను కాపాడటానికి ప్రభుత్వాలకు కొంతైనా అవకాశం ఉంటుంది. కాని ఈ విభాగాల నివేదికలు సీజన్‌కు ముందుగా అందివ్వకపోవడం పెద్దలోపం. పంట పెట్టుబడి కింద రాష్ట్రప్రభుత్వం ‘రైతుభరో సా’ పథకం కింద రైతులకు ఎకరానికి రూ.6 వేల ఇవ్వడం దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఆదర్శం. వివిధ రాష్ట్రప్రభుత్వాలు సైతం ఇదే తరహా పథకం ఆరంభానికి సన్నాహాలు ప్రారంభించాయి.
ఆయా ప్రభుత్వాలు అలాంటి పథకాలను ఓట్లను రాల్చుకునే పథకాలుగా కాకుండా, రాజకీయ పథకాలుగా మార్చకుండా రైతులకు ప్రయోజనం సమకూర్చే పథకాలుగా అమలు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరపైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మద్దతు ధర నెపాన్ని రాష్ట్రప్ర భుత్వాలపై వేయకుండా, కేంద్రమే మద్దతు ధరలను ప్రకటించాలి. అలా చేయగలిగితే రాష్ట్రాలు అక్టోబర్ నాటికి వ్యవసాయరంగం కోసం నిధులు సమకూర్చుకుంటా యి.
యంత్రాంగం, సమగ్రమై న కార్యాచరణతో ముందుకు వెళ్తాయి. తాత్కాలిక ఏ ర్పాట్లతో నిధులు సమకూర్చుకోవడం, స కాలంలో సరైన ధరకు పం టలను కొన డం సాధ్యం కాదు. రాష్ట్రప్రభుత్వం కొనుగోలు ఏమాత్రం ఆలస్యం చేసినా, వ్యాపా రులు పంటను తక్కువ ధర కు ఎగరేసుకుపోతారు. ఈ సీజన్‌లో అది పునరావృతం కాకుండా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తేనే రైతులు కష్టాల నుంచి బయటపడతారు. పాలకులు ఈ విషయాన్ని గుర్తించి, ప్రణాళికలు రచించాలి.
ఎరవులు రాబట్టడంలో బీజేపీ విఫలం..
రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి కేం ద్రానికి ఉంది. ఖరీఫ్ ఆరంభంలో ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధతను బట్టి ఏ మేరకు దిగుబడులు పెరుగుతాయన్న విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. రెండు సీజన్లలో కలిపి 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చినట్లు గణాంకాలు వెల్లడించాయి.
గతేడాది తెలంగాణ నుంచి 168.75 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. 2024 అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందని కేంద్రం తెలిపింది. జూన్‌లో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించగా, కేంద్రం కేవలం 98,000 మెట్రిక్ టన్నులు పంపించింది. జూలైలో 6.60 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 3.70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది.
రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వం బఫర్ స్టాక్ పెట్టనందుకే రైతులు రోడ్ మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇటీవల మాట్లాడుతూ.. బ్లాక్ మార్కెట్‌లో ఎరువుల విక్రయాన్ని అడ్డుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని, ఫెర్టిలైజర్ షాపు యాజమాన్యాలతో కాంగ్రెస్ నేతల కుమ్మక్కయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎరువుల దుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కయిన వారిని పట్టిస్తే రాంచందర్‌రావు పట్టిస్తే బాగుండేది. రైతులు అప్పుడు రాంచందర్‌రావునే అభినందించేవాళ్లు. అది అలా వుంచితే రైతులు ముందు కేంద్రంలోని బీజేపీ రైతులకు అన్యాయం చేసే పనులు చేయొద్దని, రాష్ట్రంలో సాగు అవసరాలకు సరిపడా ఎరువులు సమకూర్చాలని కోరుతున్నారు.
మరోవైపు ఇటీవల కేంద్ర మంత్రి నడ్డా అవసరమైతే యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించడంపై రైతులు మండిపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ ఎరువుల నిల్వలు సరఫరా చేస్తూ ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి గెలుపొందిన ఎనిమిది మంది ఎంపీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి, రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల వాటాను రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వ్యాసకర్త సెల్ 55355