calender_icon.png 2 August, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారం

30-07-2025 12:00:00 AM

దేశవృధ్యర్థం నాశేచ స్తంభ సంగయోః (కౌటిలీయం- 8-4)

దేశాభ్యుదయానికై, నాయకుడు స్తంభసంగాలు (రాజ ప్రయోజనాలకు విఘాతం) న శించడాని కోసం ప్రయత్నించాలి, అంటాడు చాణక్య. నాయకుని పురోగతిలో ప్రకృతి వైపరీత్యాలు, ఉద్యోగుల ప్రతిఘటనలు, ప్రజల తిరుగుబాటు ధోరణలు.. ఇలా ఎన్నో సమస్యలు పలకరిస్తుంటాయి. వాటిని పరిష్కరిం చుకొని ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. సమస్య అంటే ఏమిటి? మన వద్ద ఉన్న దానికి, మనం కోరుతున్న దానికి మధ్య వ్యత్యాసాన్ని సమస్యగా చెప్పుకుంటాం.

సమస్యను పరిష్కరించుకునే క్రమంలో.. సమస్య నుంచి పారిపోవడం, మనకేమి కావాలో స్పష్టతను సంతరించుకోవడం,  అందివచ్చిన దానితో సంతృప్తి చెందడం, అవసరమైన దానిని కూడా వద్దనుకోవడం లాంటి పలు మార్గాలు మనముందు నిలుస్తాయి. సమస్యలు ముఖ్యంగా మూడురకాలు. మొదటి ది.. మనవద్ద ఉన్న సమాచారం లేదా సాంకేతిక పరిజ్ఞానం సమస్య పరిష్కారానికి సరి పోకపోవడం.

రెండవది.. ఉన్న సమాచారాన్ని పునర్నిర్మించుకోలేకపోవడం.. అవసరమైన విధంలో తెలిసిన సాంకేతిక జ్ఞానాన్ని సర్దుకోవడం లేదా ఏర్పరుచుకోవడం తెలియకపోవ డం.. ఈ విధానంలో అదనపు సమాచారం గాని సాంకేతిక పరిజ్ఞానం కాని అవసరం ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని, సాంకేతికతను అంతర్దృష్టితో గమనిం చి చిన్న చిన్న మార్పులు, చేర్పులతో అవసరమైన విధానంలో వాడుకునే ఆలోచన చే యలేకపోవడమే.

మూడవ సమస్య.. అసలు సమస్య ఉన్నదనే విషయాన్ని గుర్తించక లేకపోవడమే. ప్రస్తుతమున్న స్థితినుంచి మెరుగైన ఉన్నతస్థితిని చేరేందుకు తనలో సమర్ధత ఉన్నదనే విషయాన్ని గుర్తించలేకపోవడం వల్ల కలుగుతుంది.

విస్తృత పరిధిలో ఆలోచించాలి..

మొదటి లోపాన్ని సమస్యను లోతుగా ఆలోచించడం, విశ్లేషణ చేసుకోవడం వల్ల సరిచేసుకోవచ్చు. కాని రెండవ మూడవ రకాల యిన సమస్యలకు ఆ విశ్లేషణలు సరిపోవు. వాటిని విస్తృత పరిధిలో ఆలోచించాలి. సాం ప్రదాయికమైన ఆలోచనా సరళికి భిన్నమైన ఆలోచనలను, విశ్లేషణలను రూపొందించుకోవాలి. ఊహలోకొచ్చిన అన్ని ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి.

కొన్నిమార్లవి హాస్యాస్పదంగా కనిపించవచ్చు.. కాని పరిష్కారాన్ని కనుగొనడంలో అవే ఉపకరిస్తాయి. దీనినే లాటరల్ థింకింగ్ లేదా విస్తృత పరిధి ఆలోచనా సరళి లేదా పరిమితుల కావల ఆలోచించడం అంటారు. సమస్యల పరిష్కారంలో ఈ విధానం ఉత్తమమైనది. విస్తృ తపరిధిలో ఆలోచించ లేకపోవడానికి కారణాలను విశ్లేషిస్తే.. సాధారణంగా చాలా మంది మూడు విధాలయిన అపోహలలో జీవిస్తుంటారు.

మొదటిది.. గతకాలపు పద్ధతులు వర్తమానానికి మరియు భవిష్యత్తుకు సరిపోతాయి. రెండవది.. ప్రస్తుతం ఉన్న పోకడలే భవిష్యత్తులో  కొనసాగుతాయి. మూ డవది.. భవిష్యత్తు అనిశ్చితం మరియు ప్ర మాదకరమైనది. ఈ మూడు అపోహల వల్ల సంస్థలైనా, వ్యక్తులైనా ఉన్నతిని సాధించలేక, ఆశించిన దానిని అందుకోలేక ప్రతిదీ సమస్యగా చూడడం జరుగుతుంది.

నైపుణ్యాలు పెంచాలి..

ఒకప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థ తన పునర్నిర్మాణంలో భాగంగా కొంత కాలంపాటు తమ ఉత్పత్తిలో 50శాతం తగ్గించుకున్న కారణంగా.. ఉద్యోగుల్లో దాదాపు 40శాతం మం దిని మిగులుగా తేలుస్తూ.. లేఆఫ్ ప్రకటించింది. దానితో యాజమాన్యానికి ఉద్యో గులకు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని అధిగమించేందుకు, యాజమాన్యం రోజుకు 12 పనిగంటల చొప్పున నాలుగురోజుల పని దినాలు, ఒక రోజు శిక్షణ, మూడు దినాల సెలవు విధానాన్ని  ప్రకటించింది.

ఇలా మొత్తం ఉద్యోగులు రెండు షిఫ్ట్‌ల్లో పనిచేస్తారు. ఈ విధానం ఉత్పత్తి వ్యయాన్ని పెంచినా కార్మికుల లేఆఫ్ తగ్గిస్తూ ఉద్యోగులను సంస్థ పురోగతిలో భాగస్వాములను చేసేందుకు ఉపయుక్తమైంది. నాలుగు రోజుల విశ్రాంతి వల్ల తమ వేతనాలు తగ్గుతాయని భావించిన ఉద్యోగులా విధానాన్ని వ్యతిరేకించినా, పరిస్థితులను ఆకళింపు చేసుకొని మార్పును స్వాగతించారు.

ముఖ్యంగా ప్రతివారమూ సంబంధిత రంగంలోనే కాక వేరువేరు రంగాల్లో, కొత్త నైపుణ్యాలు సంతరించుకునేందుకై, కొత్త భాషలను నేర్చుకునే లా ఉద్యోగులను ప్రోత్సహిస్తూ, శిక్షణనందివ్వడం వల్ల ఉద్యోగుల్లో ఆసక్తి పెరిగింది.. నిరంతర శిక్షణా కార్యక్రమాల వల్ల నైపుణ్యా లు పెరిగాయి. దాదాపు 70శాతం ఖర్చునూ సంస్థ భరించడం వల్ల ‘శారీరక శ్రామికులు విజ్ఞానాన్ని పొందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులుగా’ పరివర్తన చెందారు.

దానితో జ్ఞాన నైపుణ్యాలను సంతరించుకున్న ఉద్యోగుల నుంచి సంస్థ ఉన్నతి కోసం కొత్త కొత్త ఆలోచనలు రావడం ఆరంభించాయి. కొన్ని సంవ త్సరాల్లోనే అమ్మకాలు 100శాతం కన్నా ఎక్కువగా పెరిగాయి. నికర ఆదాయం ఆరింతలుగా పెరిగింది. ఉద్యోగుల వేతనాలు 6శా తం పెరిగాయి. రెండవ సంవత్సరం నుంచే ఉత్పాదకత పెరిగి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అధికంగా చెల్లించబడ్డాయి. సంస్థ విజయపథంలో నడిచింది.  

అడ్డంకుల మాటున అవకాశాలు..

తదుపరి కాలంలో ఆ సంస్థలో ఈ వి ధానం కొనసాగిందా.. ప్రతిసారీ సత్ఫలితాలే వచ్చాయా.. వస్తే, మిగతా సంస్థలూ ఆ విధానాన్ని అనుసరించేందుకు ముందుకు వచ్చా యా.. అనే ప్రశ్నలను పక్కన పెడితే.. ఒక సమస్య వచ్చిన సమయంలో సాంప్రదాయికమైన పరిష్కార మార్గాలనే పట్టుకుంటే ఫలితం లేకపోవచ్చు. సమస్య పరిధులను అధిగమించి ఆలోచిస్తేనే అద్భుతమైన ఫలితాలు ఆవిష్కృతమవుతాయి.

ఒకప్పుడు స త్ఫలితాల నిచ్చిన ఆలోచనలు కాలక్రమంలో వాడుకలో లేనివిగా మారి వర్తమానానికి, భవిష్యత్తుకు సరిపోకపోవచ్చు. అలాగే.. మా రుతున్న సాంకేతిక అభివృద్ధిలో ప్రస్తుతం ఉన్న పోకడలే భవిష్యత్తులో  కొనసాగడం జరగదు. అంతేకాదు, భవిష్యత్తు అనిశ్చితం కాని ప్రమాదకరం కాని కాదు. అడ్డంకులనుకున్న వాటి మాటున అద్భుతమైన అవకా శాలు వేచి ఉంటాయి. కాబట్టి..

అనవసరమైన భయాలను, అపోహలను పారద్రోలి భవిష్యత్తుపై ఆశలతో ఆశయాల సాధన కో సం ఉద్యమించడం ఉత్తమం. స్థాయిని చూడకుండా వ్యక్తులనందరినీ గౌరవించడం, విని యోగదారుల సంతృప్తి, సామాజిక బాధ్యత, ఉత్పత్తులకు అదనపు విలువలను సృజించ డం, సృజనాత్మతను ప్రోత్సహించడం వంటి సంస్కృతిని ఆదరించిన సంస్థ విజయాన్ని సాధిస్తుంది.

దానికి అదనంగా ఉద్యోగులను.. “ఉత్పత్తిలో ముడి సరకుగా కాకుండా సంస్థ కుటుంబ సభ్యులు”గా చూడడం వల్ల ఉద్యోగుల్లో అంకితభావం నెలకొంటుంది. తద్వా రా ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేస్తారు.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచుతారు. సమస్యను చూసి భయపడితే అది భూతంగా భయపెడుతుంది. దానిని ఎదిరిస్తే తోక ముడుచుకొని పారిపోతుంది. అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకునేందుకు ప్రేరణ నిచ్చేదే సమస్య అని భావిస్తూ సాంప్రదాయిక పరిధులు దాటి కొత్తగా ఆలోచించడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటాం.