31-07-2025 12:06:33 AM
‘స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో బీఈడీ అభ్యర్థులకు కేవలం 30 శాతం కేటాయిస్తూ ఎస్జీటీలకు 70 శాతం ప్రమోషన్స్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. బీఈడీలకు కనీసం 80 శా తం తగ్గకుండా కోటా ఇవ్వాలని తెలంగాణ రాష్ర్ట బీఈడీ అభ్యర్థుల సంఘం మహాపాదయాత్ర నిర్వహించ తలపెట్టింది. ఈ మహాపాదయాత్ర ఆగస్టు 3 ఆదివారం నుంచి గురువారం వరకు ఉండ నుంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్‌లో పదివేల పోస్టులకు నోటిఫికేషన్ వెలు వడుతుందని చెబుతున్నారు. అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం. మన పోస్టుల కోసం మనం పోరాటం చేయా ల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని బీఈడీ అభ్యర్థులు ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.
తలారి గణేష్, యాదాద్రి జిల్లా