calender_icon.png 18 September, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదు

18-09-2025 06:52:56 PM

ఈ రాష్ట్ర అవినీతి సూత్రధారి కేసీఆర్ యే 

ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ 

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కేసీఆర్ తో తెలంగాణ రాష్ట్రం రాలేదని, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని సైతం కేసీఆర్ ప్రారంభించలేదని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. గురువారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పరిపాలన చేసినట్టి కేసీఆర్ హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద మోప పడ్డదని అన్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత, ఇతర మంత్రుల ద్వారా అవినీతి జరిగిందన్నారు ఇప్పుడు కవిత గత కొన్ని రోజుల క్రితం ఒక కొత్త వాదాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచిందన్నారు. ఈ అవినీతికి అంతటికి కారణం హరీష్ రావు, సంతోష రావులు  అని ఇందులో కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

వాస్తవంగా హరీష్ రావు,సంతోష్ రావు,కేటీఆర్, కవిత, ఈ నలుగురు కేసిఆర్ కు నాలుగు చేతులు లాంటివారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతికి కేసిఆర్ యే సూత్రధారని ఈ నలుగురు, ఇతర మంత్రులు పాత్రధారులే అని అన్నారు.30 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి రీ డిజైన్ తో లక్ష కోట్లకు అంచనాలు పెంచి 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. 1971 ఆర్ ఓ ఆర్ యాక్ట్ ద్వారా 1948 నుండి వచ్చిన వివిధ రెవెన్యూ యాక్ట్ లా ద్వారా తెలంగాణలో ఉన్న భూమి శ్రీరికరణ జరిగి ప్రజలకు, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు 1995 నుంచి 2005 వరకు అందించడం జరిగింది అన్నారు. అనవసరంగా 20 20 లో ఆర్ ఓ ఆర్ కొత్త యాక్టును తీసుకువచ్చి 1971 యాక్టను రద్దు చేయడం వలన రెవెన్యూ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి 25 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి వెళ్లిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన 25లక్షల ఎకరాల భూమి ప్రైవేటు భూమిగా మారిందన్నారు. 

ఈ వ్యవహారం, 111 జీవోను ఎత్తివేసి లక్షల కోట్ల రూపాయలను గోల్ మాల్ కేసిఆర్ ప్రభుత్వంలో జరిగిందనని. దీంతో కేసీఆర్, ఆ నలుగురు, ఇతర మంత్రులు పాత్రధారులుగా ఉండి తెలంగాణలో అతిపెద్ద అవినీతి కుంభకోణం జరిగిందని మీడియా మొత్తం కోడై కుసిందన్నారు. దళితులకు దళిత బంధు, మూడు ఎకరాల భూమి, 17 లక్షల దళిత కుటుంబాలకు, వారి సంక్షేమ నికి 1,70,000 కోట్లు ఖర్చు అవుతాయని అన్న కేసీఆర్ కేవలం 13 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. టీఎస్ పి ఎస్సి ద్వారా జరిగిన రిక్రూట్మెంట్ లు అన్ని లీకేజీలుగా మారాయి, అదే పాపం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది అన్నారు. కేసిఆర్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పు వల్ల ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం 1997  లో భువనగిరి సభ ద్వారా ఒక గద్దర్, కాళోజి నారాయణరావు, జయశంకర్, భూపతి కృష్ణమూర్తి, ప్రొఫెసర్ జనార్దన్ రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణలా ద్వారా మొదలై మారోజు వీరన్న ఏర్పాటు చేసిన తెలంగాణ మహాసభ, తెలంగాణ జన సభ, జయశంకర్ నాయకత్వంలోని తెలంగాణ ఐక్యవేదిక తర్వాత 2000 సంవత్సరంలో 42 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధానమంత్రి వాజపేయిని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. 

అప్పుడు తెలంగాణ అంశం ఒక రాజకీయ ఎజెండగా  మారిందన్నారు. 2001 లో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టకముందే  కొన్ని 100 ల సమావేశాలు జరిగాయన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక కేసీఆర్ రే కాదు విద్యార్థి సంఘాలు, కార్మిక, కర్షక  సంఘాలు, న్యాయవాద సంఘాలు, కళాకారులు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, సకల జనులు, అన్ని రాజకీయ పార్టీ లు ఏకమై ఉద్యమిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి మద్దతు పలికితే తెలంగాణ రాష్ట్రం  ఏర్పడ్డదని  కొరివి వేణుగోపాల్ అన్నారు. దీంట్లో కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంత? కానీ కెసిఆర్ చతురత తోని ఢిల్లీ నుంచి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్  పటేల్ లు మాట్లాడార ని జెండాలు ఏ జెండాలు లేవని అంతా తెలంగాణ ఏ అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను బురిడీ కొట్టించి తెలంగాణ ప్రజలను నమ్మించి, 2014లో అధికారంలోకి వచ్చి అవినీతికి పాల్పడ్డారు తప్ప అభివృద్ధి చేసింది లేదన్నారు. 2018లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితోనే ములాఖత్ అయి ముందస్తు ఎన్నికలు  పేట్టించుకోని అప్పటికే అన్ని పార్టీల్లోని నాయకులను టిఆర్ఎస్ లో చేర్పించుకొని రెండోసారి మళ్లీ అధికారంలోకి వచ్చి ధరణి ని తీసుకువచ్చి తెలంగాణ ప్రజలను ఆగం ఆగం చేశారాన్నారు. ఇంత చేసిన కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో చిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, సిహెచ్ రవీందర్, గజ్జల రవీందర్, నల్లాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.