21-08-2025 08:19:54 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో గర్ల్ కన్వీనింగ్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం రోజున జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ(SFI State Girls Convener Makkapalli Pooja) హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ, దేశంలో అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్రం, కేంద్రం ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆమె అన్నారు. గంటకు ఒక అత్యాచారాలు అరగంటకు ఒక అరచకాలు జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి పట్టడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు,దేశ వ్యాప్తంగా విద్యార్థినిలపై దాడులు జరుగుతున్న వాటిని అరికట్టలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్లో మెడికల్ విద్యార్థిని పై గత సంవత్సరం జరిగిన హత్యచారంపై ఇప్పటికి కూడా విచారణ జరిపించడంలో పూర్తిగా విఫలమవుతుంది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగా ప్రతినెల శానిటరీ వ్యాప్ కిన్ కొనుక్కోవాలంటే ప్రతి నెల 200 రూపాయల ఖర్చు అవుతుంది, పేద విద్యార్థులు చదువుకోవడానికి మరియు ఇతర వస్తువులు కొనుగోలు చేయటానికి వెయ్యి రూపాయలు ప్రతినెలా ఖర్చు అవుతుంది , కావున గతంలో మాదిరిగా ప్రభుత్వమే ఉచిత శానిటరీ నాప్కిన్ అందించాలని ఆమె కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థుల మహిళల సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ నాయకురాలు అక్షయ మరియు అర్చన పాల్గొన్నారు.