calender_icon.png 22 August, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదం.. రోడ్డున పడ్డ కుటుంబం

21-08-2025 10:43:34 PM

ఎల్బీనగర్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలతో టైలర్ షాపు, కిరాణ షాపు దగ్ధమైన ఘటన చంపాపేట డివిజన్ లో గురువారం చోటుచేసుకుంది. దీంతో ఓ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే... చంపాపేట డివిజన్ కర్మన్ ఘాట్ పరిధిలోని శుభోదయ కాలనీ రోడ్ నంబర్-7 లో ఎరుకల లావణ్య గౌడ్ తన కుటంబ పోషణ కొరకు టైలరింగ్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్నది‌. గురువారం ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Electrical short circuit) వారి బ్రతుకును బుగ్గిపాలు చేసింది.

బాధితురాలు లావణ్య రోజు మాదిరిగానే గురువారం షాపు తెరిచింది. మధ్యాహ్నం 1 గంటల సమయంలో షాపు మూసివేసి, భోజనం చేయడానికి సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించిందని స్థానికులు లావణ్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే షాపు దగ్గరకు వెళ్లగానే అప్పటికి పూర్తిగా అగ్నికి బూడిదైంది. అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో రూ.80వేల నగదు, షాపుల ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ, 15 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితురాలు లావణ్య కన్నీరు మున్నీరై విలపిస్తుంది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.