21-08-2025 10:35:09 PM
సహకార సంఘం డైరెక్టర్ మద్దెల వెంకటలక్ష్మి రాజయ్య
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సహకార సంఘం డైరెక్టర్ మద్దెల వెంకటలక్ష్మి రాజయ్య(Director Maddela Venkatalakshmi Rajaiah) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ జిరాక్స్ పత్రాలను తమ వెంట తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయన్నారు. రైతులు ఏమాత్రం అధైర్య పడవద్దని, రైతులకు యూరియా కొరత లేకుండా వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు కావాలని యూరియా నిల్వలు లేవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని రైతుల పక్షాన మేమున్నామని, యూరియా కావలసిన రైతులు సహకార సంఘంలో సంప్రదించగలరని కోరారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.