21-08-2025 08:21:56 PM
కాగజ్‌నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణం(Kagaznagar town)లోని పెద్దవాగు సమీపంలో అక్రమంగా నిర్వహించిన కలపను స్వాధీన పరుచుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఓ సామిల్లు యజమాని ఆ కలపను నిల్వ ఉంచినట్లు తెలిపారు. కలపను స్వాధీన పరుచుకుని, సామిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఆ కలప విలువ దాదాపు రూ.55 వేల వరకు ఉంటుందన్నారు.