calender_icon.png 22 August, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల రచనలు ఆవిష్కరణ

21-08-2025 10:45:27 PM

సిద్దిపేట క్రైమ్: సిద్దిపేట జిల్లా(Siddipet District) చిన్న కోడూరు మండలంలోని అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రాసిన "అనంతసాగర్ అక్షర కెరటాలు" అనే బాలల కథల పుస్తకాన్ని బాల చెలిమి, దక్కన్ ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించారు. ఏడో తరగతి విద్యార్థి బి.విశ్వతేజ రాసిన "విశ్వతేజం " కథల పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు డా.రఘు ఆవిష్కరించారు. బాలల రచనలు ముద్రించడానికి చిల్డ్రన్ అకాడమీ సహాయం చేస్తోందని, ఉపాధ్యాయులు బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాలని వేదకుమార్ సూచించారు. కార్యక్రమంలో బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్, కథల తాతయ్య రాజమౌళి, తోట మధుసూదన్, ఉపాధ్యాయులు శ్రీదేవి, సమ్మయ్య, నరేష్, దుర్గయ్య, పర్షరాములు, బాలచెలిమి ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.