21-08-2025 10:33:00 PM
నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమం
మునిపల్లి: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) మునిపల్లి మండలం వోక్స్ యునివార్సిటిలో గురువారం మహిళా శిశు వికలాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ క్రింద మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సెక్రెటరీ సౌజన్య మాట్లాడుతూ, NDPS చట్టంపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల సరపరా ముఠాలు ప్రధానంగా విద్యార్థులనే లక్ష్యంగా చేస్తూ వారిని మాదకద్రవ్యాలకు అలవాటు చేసి వారి ద్వారానే మాదకద్రవ్యాల సరపరా చేస్తున్నారని, విద్యార్థులు వాటి కోసం నేరాలకు పాల్పడి తమ బంగారు భవిష్యత్తు నిర్వీర్యం చేసుకుంటున్నారని తెలిపారు. కావున యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించుటకై వివిధ శాఖల సమన్వయముతో తెలంగాణా ప్రభుత్వము “మిషన్ పరివర్తన” కార్యక్రమమును నిర్వహిస్తున్నట్లుగా తెలియజేసారు.
ఎవరైనా మాదకద్రవ్యాలను సేవిస్తున్న లేదా విక్రయిస్తున్న “నషా ముక్త్ భారత్ అభియాన్” హెల్ప్ లైన్ నెం.14446 ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. తదనంతరం మాదకద్రవ్యాల దుర్వినియోగం పై జిల్లా అధికారులు పోస్టర్స్ ఆవిష్కరించారు మరియు విద్యార్థులచే నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమ.ము వయో వృద్దుల సంక్షేమ శాఖ , యూనివర్సిటీ డైరెక్టర్ శశికాంత్ ఉపాధ్యాయ,, యూనివర్సిటీ డీన్ అన్నం నేని శ్రీలత, శ్రీధర్ డైరెక్టర్ అండ్ సెక్యూరిటీ, కాంకోల్ మెడికల్ ఆఫీసర్ రాణి, ఎక్సైజ్ ప్రొహిబిషన్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, జగదీశ్వర్ పోలీస్ అధికారి , మహిళా జిల్లా సాధికారత సమాన్వయకర్త పల్లవి,మరియు మహిళా శిశు దివ్యాంగుల వయో వృద్దుల సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.