calender_icon.png 15 June, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘట్‌కేసర్‌లో వయోధికుల హక్కుల పరిరక్షణ కోసం నిరసన

14-06-2025 12:00:00 AM

ఘట్ కేసర్, జూన్ 13 : ఘట్ కేసర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద తె లంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోధికుల హక్కుల పరిరక్షణ కొరకై శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ నిరసన పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలో వయోధికుల హక్కుల చట్టం రూపొందించబడినదని, ఈ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ముఖ్యంగా వృద్ధులు పో షించుకోలేని స్థితిలో ఉన్నవారికి వారి పిల్లలు భరణం చెల్లించాలని, వృద్దుల ఆస్తి పై వారికి సంపూర్ణ అధికారం ఉన్నదని, వృద్దులకు గౌరవప్రదమైన జీవితం ప్రసాదించేందుకు ప్రభుత్వా లు పూనుకోవాలని, దేశాభి వృద్ధికై పునాదులు వేసిన వృద్దులకు ఆర్.టి.సి బస్సులో 50శాతం రాయితీ కల్పించాలని, కరోన సమయంలో రద్దు కాబడిన రైల్వే ప్రయాణంలో వృద్దులకు రాయితీలు పునరుద్దించాలని, బ్యాంకులు,

పోస్ట్ ఆఫీసులందు వృద్దులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని, వృద్దులకు రేషన్ కార్డు ద్వారా ఇంటిటింటికి మొబైల్ వ్యాన్ ద్వారా చిరు ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డ్, బెడ్స్ ఏర్పాటు చేయాలని, వయోధికులకు కంటి అద్దాలు, చేతి కర్రలు ఉచితంగా ఇవ్వాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో టాస్కా ఘట్కేసర్ మండల అధ్యక్షులు తోట రంగయ్య, కార్యదర్శి బత్తుల మల్లారెడ్డి, పి.యాదిరెడ్డి, కొర్రెముల సుప్రభాత్ టౌన్ షిప్ నుంచి బంగారి రాజయ్య, కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, కాచవానిసింగారం టాస్కా కార్యదర్శి పృథ్వి రాజ్ గౌడ్, నారపల్లి నుంచి జి.వి. రాజి రెడ్డి, ఎన్ ఎఫ్ సి నగర్ నుంచి బి. సోమయ్య, చౌదరిగూడ నుంచి జగదీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, జి. పోచిరెడ్డి, పి. యాదిరెడ్డి, ఏ. నాగరాజు, ఎస్. సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం ముగిసిన తరువాత ఘట్కేసర్ మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్యశాల, మండల ఆఫీసు, పోలీస్ స్టేషన్ల ముందు వయోధికుల హక్కులపై అవహగన కల్పించేందుకు టాస్కా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.