రాత్రికి రాత్రే ఆలయం.. విగ్రహం తొలగింపు
60 గజాల ఇళ్ల స్థలాల కోసం 45 రోజులుగా బాధితుల దీక్ష
విగ్రహం తొలగింపుతో ఆగ్రహం..
రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి ఆందోళన
మొయినాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): 60 గజాల ఇళ్ల స్థలాల కోసం 45 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న బాధితులు ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు విగ్రహాన్నితొ లగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితు లు, స్థానికులు రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి ఆందోళనకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను పక్కకు తరలించారు. ఈ ఘటన మంగళవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో చోటుచేసుకుంది. విగ్రహాన్ని అధికారులు మరోచోట భద్రపరిచినట్లు స మాచారం. కాగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో భాగంగానే చర్యలు తీసుకున్న ట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభు త్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్రెడ్డి అక్కకి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల ఇళ్ల స్థలాల సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.






