శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
17-04-2026 08:03 PM
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు భోజన సమయంలో బోధ నేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా పీఆర్సీ, రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్, హెల్త్ కార్డ్స్, పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి. మొదలగు ప్రధాన డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ వై.కిషోర్, సూపరెంటెండెంట్ ఆర్.భీమయ్య, నరసయ్య, లచ్చయ్య, ఇతర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.






