calender_icon.png 16 December, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు అరెస్ట్

15-12-2025 12:31:31 AM

బోధన్ డిసెంబర్ 14 (జయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామ పంచాయతీ ఎన్నికలలో జరిగిన గొడవ కక్షల కారణంగా హింసాత్మక సంఘటనలకు పడినస నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నూర్ మసీద్లో ప్రార్థనల అనంతరం సర్పంచ్ అభ్యర్థి రిజ్వానా బేగానికి మద్దతు ఇవ్వలేదనే కారణంతో ఇబ్రహీం, అబూబకర్, వాజిద్, ఆవేజ్లు పథకం ప్రకారం దారులకు పాల్పడ్డారు.

హుండాయ్ వెర్నా కారులో వచ్చి జామీలుద్దీన్, అఫ్సర్, హైమద్లపై కత్తులు, ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఏసీబీ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో నిందితులు దాడికి ఉపయోగించిన మారణాయుధాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు