మరో 8 కోట్ల పనిదినాలు కల్పించండి
- కేంద్రానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 13 ( విజయక్రాంతి): రాష్ట్రంలో ఉపాధి హమీ పనులు వేగంగా జరుగుతున్నాయి. యాసంగిలో వ్యసాయ పనులకు సరైన నీటి వసతి లేక పనులు అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో అనేక మంది ఉపాధి హామీ పనులకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది .ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో 8.23 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల పనిదినాలు మాత్రమే మంజూరు చేసింది. అప్పడే ఈ పనిదినాలు సరిపోవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలిపినా స్పందించలేదు. కేంద్రం కేటాయించిన పనిదినాలు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 10 నెలల కోసం మరో 8 కోట్ల పనిదినాలు మంజూరు చేయాలని కోరగా ఇంత వరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు.
రాష్ట్రంలో వ్యసాయ పనులు సరిగా లేక పోవడం, భూ గర్భ జలాలు అడుగంటడం, పనులు లేక జీవనం సాగించడానికి ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. గతంలో వేసవిలో పుష్కలంగా నీరు, కరెంట్ లభించడంతో వ్యసాయ పనుల వైపు కూలీలు మొగ్గు చూపేవారు, కాని ప్రస్తుతం ప్రభుత్వం సాగు నీరు, విద్యుత్‌ను సరఫరాలో పలు సమస్యలు రావడం వంటి సమస్యలు ఏర్పడటంతో అత్యధిక పనిదినాలు అయ్యాయనే అభిప్రాయం వ్యక్తం వుతోంది. గత నాలుగు సంవత్సరాలు ఏప్రిల్,మే నెల్లో పని దినాలు వివరాలు ఇలా ఉన్నాయి ః 2021 ఆర్దిక సంవత్సరంలో 7 కోట్ల 49 పనిదినాలు ఉండగా 202223లో 7.21 కోట్ల పనినాదు, 202324లో 5.44 పనిదినాలు, 2024 25లో 8.23 కోట్లు పనిదినాలను కేంద్రం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.






