22 August, 2026 | 7:01 AM

బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తాం

14-06-2024 12:15 AM
  • ఐపీఎం సేవలను ఆధునీకరిస్తాం 

ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలను పెంచుకోవాలని, ఇందుకు క్రమం తప్పకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాలని సూచించారు. మెరుగైన పనితీరు ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని 14 బ్లడ్ బ్యాంకులను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లడ్ బ్యాంకుల నిర్వహణ,- బలోపేతంపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. రాష్ర్టంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణ, బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన పనితీరును కనబర్చాలని చెప్పారు.

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 63 బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వాహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్ర వారం జరిగే ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సంద ర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహిం చాలని సూచించారు. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సేవలను ఆధునీకరించి మరింత విస్తరిస్తామని వెల్లడించారు. సమావేశంలో వైద్యారోగ్య శా ఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎయి డ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, ఐపీఎం డైరెక్ట ర్ డాక్టర్ శివలీల, మెడికల్ అండ్ హెల్త్ అదనపు డైరెక్టర్ అమర్‌సింగ్ పాల్గొన్నారు.