calender_icon.png 11 July, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో ఘనంగా పోకల దమ్మక్క సేవయాత్ర

10-07-2025 11:29:09 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఆషాడ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో అపర శబరి పోకల దమ్మక్క సేవా యాత్ర ఘనంగా నిర్వహించారు. సాక్షాత్తు రామయ్య తన కలలో కనిపించి భద్రగిరిపై ఓ పుట్టలో తన మూల వరుల జాడ తెలిపిన అపర భక్తురాలు గిరిజన మహిళ పోకల దమ్మక్క. దమ్మక్క సేవలను కొనియాడుతూ ప్రతిఏటా ఈ ఉత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ప్రధాన ఆలయంలో మూలవరులకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దమ్మక్క విగ్రహం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థానం సిబ్బంది, రామ భక్తులతో ఆలయం చుట్టూ దమ్మక్క చిత్రపటంతో గిరిప్రదక్షిణ ప్రదక్షణ నిర్వహించారు, అలాగే పట్టణంలో భక్త బృందంతో నిర్వహించిన శోభాయాత్రలో భాగంగా పోకల దమ్మక్క విగ్రహానికి అర్చకులు వేద పండితులు పూలమాల వేసి హారతులు సమర్పించారు అలాగే దమ్మక్క వారసులైన గిరిజనులకు కండువాలు కప్పి సత్కరించారు. ప్రతి ఏటా ఆషాడ పౌర్ణమి నాడు ఘనంగా దమ్మక్క సేవా యాత్ర నిర్వహిస్తున్న భద్రాద్రి దేవస్థానం.