calender_icon.png 31 July, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలి

30-07-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, జూలై 29 (విజయ క్రాంతి): పాఠశాలలోని విద్యార్థులకు నాణ్య తా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధి కారులను ఆదేశిం చారు.   మంగళవారం బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికం గా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ ఆరా తీశా రు. 

ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని  ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలి ఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలని అన్నారు.