30-07-2025 12:00:00 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, జూలై 29 : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతులుగా ఎదగాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ ఆదర్శ పాఠశాల ఉత్తమ పాఠశాలగా ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యువత చదువుతో పాటు నైపుణ్యాలు, ఆలోచన శక్తి పెంపొందించు కోవాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి కృషి చేస్తానన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్.రంజిత, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి. పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.