25 April, 2026 | 6:09 PM

నాణ్యమైన భోజనం అందించాలి

29-11-2024 01:15 AM

ఖమ్మం, నవంబర్ 28 (విజయక్రాంతి): గురుకులాలు, వసతీ గృహాల్లో తమకు ణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై పీడీఎస్‌యూ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఖమ్మంలో విద్యార్థులు ప్లేట్లు, లంచ్ బాక్స్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్‌తో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.