calender_icon.png 27 July, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

25-07-2025 01:06:16 AM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై ౨౪ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం నాణ్య మైన ఆహారాన్ని అందించాలని జిల్లా అదన పు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలోని సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి వంటశాల, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, సామాగ్రి నిల్వ చేసే గది పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య బోధన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వంటలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని తెలిపారు. 

10వ తరగతి విద్యా ర్థులకు ఖాన్ అకాడ మీ ద్వారా విద్య అందించే విధానాన్ని తానే స్వయంగా విద్యార్థులకు గణితము బోధించి, వారితో స్వయంగా అభ్యాసనం చేయించి అవగాహన కల్పించారు. ఖాన్ అకాడమీ ద్వారా విద్యా బోధన చేయడంతో విద్యార్థులకు అన్ని విషయాల పట్ల అవగాహన కలు గుతుందని తెలిపారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఫిజిక్స్ వాలా తరగతులు నిర్వహించాలని, తద్వారా జేఈఈ, నీట్ వంటి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉం టుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, మండల విద్యాధికారి సుధాకర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.